శ్లోకం - 15
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ | స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఉద్వేగమును కలిగించనివి, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి, ఇతరులకు బాధ కలిగించకుండా సత్యమును పలుకడం మరియు వేద శాస్త్రముల పఠనము మొదలగునవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుచున్నవి.