శ్లోకం - 16

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః | భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మానసిక ప్రశాంతత, శాంత స్వభావము, మౌనము, ఆత్మ నిగ్రహము, అంతః కరణ శుద్ధి మొదలగునవి మనస్సుకు సంబంధమైన తపస్సు అని చెప్పబడుచున్నవి.