శ్లోకం - 17

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః | అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భక్తి శ్రద్ధలు కలిగిన మనుష్యులు పూర్తి అంకితభావముతో ఈ మూడు రకాల తపస్సులను ప్రతిఫలములను ఆశించకుండా చేసినప్పుడు అది సాత్విక తపస్సు అని అంటారు.