శ్లోకం - 20
దాతవ్యమితి యద్దానం దీయతే௨నుపకారిణే | దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దానము చేయటమే కర్తవ్యముగా భావించి ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్హతగల ప్రాణులకు, సరియైన సమయములో, సరియైన ప్రదేశములో దానము చేసినప్పుడు అది సత్త్వ గుణ దానము అని చెప్పబడుతుంది.