శ్లోకం - 21

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః | దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రత్యుపకారము కోసము కాని, ప్రతిఫలములు ఆశించి కాని, అయిష్టముగా బాధపడుచూ ఇచ్చు దానమును రాజస దానము అని చెప్పబడుచున్నది.