శ్లోకం - 22

అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే | అసత్కృతమవజ్ఞాతం తత్తామస ముదాహృతమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనుచిత ప్రదేశములో, తగని సమయములో, అర్హత లేని వారికి, గౌరవ మర్యాదలు చూపకుండా, అవమాన పరుస్తూ ఇచ్చు దానము తామస దానము అని చెప్పబడుచున్నది.