శ్లోకం - 23
ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః | బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: "ఓం తత్ సత్" అను మూడు పదములు సృష్టి ప్రారంభం నుండి పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. వాటిచే బ్రాహ్మణులు, వేదములు మరియు యజ్ఞములు సృష్టించబడినవి.