శ్లోకం - 24
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః | ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక యజ్ఞములు, దానములు, తపస్సులు చేసేటప్పుడు వేద మంత్రములను పఠించు వైదికులు ఎల్లప్పుడూ "ఓం" అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.