శ్లోకం - 27

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే | కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞము, తపస్సు, మరియు దానములకు సంబంధించిన నిష్ఠకు కూడా "సత్" అను పదము సంకేతము. పరమాత్మను ఉద్దేశించి ఆచరించు నిశ్చయాత్మక కర్ములు కూడా "సత్" అని పిలువబడుచున్నవి.