శ్లోకం - 28

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ | అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా(అర్జునా), అశ్రద్దతో ఆచరించు యజ్ఞములు, దానములు, తపస్సులు మరియు ఇతర శుభకర్మలు అన్నియూ "అసత్" అని అందురు. వాటి వలన బ్రతికుండగా ఈ లోకములో కానీ లేదా చనిపోయిన తరువాత పర లోకములో కానీ ఏ విధమైన ప్రయోజనము ఉండదు.