శ్లోకం - 1
అర్జున ఉవాచ: సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ | త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాబాహువులు కల హృషీకేశా(కృష్ణా), సన్యాసము మరియు త్యాగముల యొక్క స్వరూపములను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే వాటి మధ్య వ్యత్యాసములను కూడా తెలుసుకోవాలని ఉంది.