శ్లోకం - 4
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ | త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పురుషశ్రేష్ఠా(అర్జునా), సన్న్యాసము మరియు త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గురించి నా నిర్ణయమును వినుము. త్యాగము అనేది మూడు విధములుగా చెప్పబడుచున్నది.