శ్లోకం - 5
యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ | యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞము, దానము మరియు తపస్సు అను కర్మలు తప్పకుండా చేయదగినవి. వాటిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అంతేకాకుండా ఈ మూడు కూడా మన ఆధ్యాత్మిక ఉన్నతికి, వికాసానికి దోహదపడుతాయి.