శ్లోకం - 6

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ | కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఓ పార్థా(అర్జునా), ఈ యజ్ఞము, దానము, తపస్సు అను కర్మలతో పాటు కర్తవ్య కర్మలన్నీ కూడా ఫలముల యందు ఆసక్తిని విడిచి చేయదగినవని నా యొక్క ఖఛ్చితమైన ఉత్తమ అభిప్రాయం.