శ్లోకం - 7

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే | మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శాస్త్ర విహిత(చేయవలసిన) కర్మలు విడిచిపెట్టడం ఎన్నటికీ సరియైనది కాదు. అవివేకంతో చేసే అలాంటి త్యాగమును తామస త్యాగమని చెప్పబడినది.