శ్లోకం - 8
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ | స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలు తనకు దుఃఖము కలిగిస్తాయనే భావనతో గాని, శరీరమునకు శ్రమ కలుగుతుందనే భయముతో కాని విడిచిపెట్టడాన్ని రాజస త్యాగము అని అంటారు. రాజస త్యాగము చేసినవాడు త్యాగ ఫలమును పొందలేడు.