శ్లోకం - 9

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే௨ర్జున | సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: విధిగా చేయవలసిన కర్మలు కర్తవ్యములుగా భావించి వాటి పట్ల ఆసక్తిని మరియు ఫలములను విడిచి ఆచరించినప్పుడు అది సాత్విక త్యాగము అని చెప్పబడినది.