శ్లోకం - 12

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ | భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఫలములను ఆశించి కర్మలు ఆచరించు వారికి మరణించిన తరువాత సుఖము, దుఃఖము మరియు ఈ రెండింటి మిశ్రమము అను మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ కర్మ ఫలములను త్యాగము చేసిన వారికి ఈ మూడు రకముల ఫలములు ఎప్పటికీ కలగవు.