శ్లోకం - 13

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే | సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సర్వ కర్మలూ ఫలించడానికి ఐదు కారణములు గలవని సాంఖ్య శాస్త్రము పేర్కొంది. ఆ ఐదు కారణములను గురించి ఇప్పుడు వివరిస్తాను వినుము.