శ్లోకం - 15
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః | న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మానవుడు శరీరము, వాక్కు లేదా మనస్సుతో ఏ కర్మను ప్రారంభించినను, అది మంచి కర్మ లేక చెడు కర్మ అయినా కూడా దానికి ఈ ఐదు కారణములు.