శ్లోకం - 19

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః | ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జ్ఞానము, కర్మము మరియు కర్త అను ఈ మూడు కూడా గుణముల పరముగా ఒక్కోటి మూడు విధములుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము నందు చెప్పబడినది. వాటిని గురించి వివరించెదను వినుము.