శ్లోకం - 20
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే | అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేర్వేరుగా కన్పించే సర్వ ప్రాణులయందు కూడా నాశనము లేని అవిభక్తమైన ఆత్మను చూసేవాడి జ్ఞానము సాత్వికజ్ఞానమని తెలుసుకొనుము.