శ్లోకం - 21
పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌పృథగ్విధాన్ | వేత్తి సర్వేషు భూతేషు తద్‌జ్ఞానం విద్ధి రాజసమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేర్వేరుగా కన్పించే సర్వ ప్రాణులలోని ఆత్మలు అనేక విధములుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా ఉంటాయని భావించేవాడి జ్ఞానము రాజస జ్ఞానమని తెలుసుకొనుము.