శ్లోకం - 22
యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ | అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీచమైనది, కారణము లేనిది, తత్వము కానిది, అల్పమైనది అగు కర్మములు మాత్రమే సంపూర్ణ ఫలములు ఇచ్చేవి అని భావించేవాడి జ్ఞానము తామస జ్ఞానమని తెలుసుకొనుము.