శ్లోకం - 23
నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ | అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మమకార ఆసక్తులు లేకుండా, రాగ ద్వేషములు లేకుండా మరియు ఫలాపేక్ష లేకుండా శాస్త్ర బద్ధముగా చేసే కర్మను సాత్విక కర్మ అని అంటారు.