శ్లోకం - 27

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో௨శుచిః | హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ ఫలముల యందు ఆసక్తి గలవాడు, దురాశ గలవాడు, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, శుచీ మరియు శుభ్రము లేనివాడు, సుఖము మరియు దుఃఖములకు ప్రభావితం చెందుతూ కర్మలు చేసేవాడిని రాజస కర్త అని అంటారు.