శ్లోకం - 30

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే | బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఏ రకమైన కర్మలు చేయాలి, ఏ రకమైన కర్మలు విడిచిపెట్టాలి, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడ వలసిన అవసరము లేదు, ఏది బంధము, ఏది మోక్షము అని గ్రహించిన బుద్ధి సాత్వికబుద్ధి.