శ్లోకం - 32

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా | సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), చీకటిలో కప్పివేయబడిన జ్ఞానముతో అధర్మమును ధర్మముగా మరియు అన్ని విషయములను విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి.