శ్లోకం - 33

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః | యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఏ ధృతి వలన మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియములు ఏకాగ్రతతో మోక్షమును సాధించు సంకల్పముతో ఉపాసించుచున్నదో అట్టి ధృతి సాత్వికమైనది.