శ్లోకం - 34

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే௨ర్జున | ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), కర్మఫలములను భోగించాలనే కోరిక గలవాడు ఏ ధృతి వలన ధర్మ(విధులు), అర్ధ(సంపద), కామము(సుఖములు) పట్ల ఆసక్తితో కర్మలను చేయుచున్నాడో అట్టి ధృతి రాజసికమైనది.