శ్లోకం - 35

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ | న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), దుర్భుద్ధి గలవాడు ఏ ధృతి వలన పగటికలలు, భయము, దుఃఖము, నిరాశ, దురహంకారమును విడువకున్నాడో అట్టి ధృతి తామసికమైనది.