శ్లోకం - 37

యత్తదగ్రే విషమివ పరిణామే௨మృతోపమమ్ | తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రారంభంలో విషములా ఉన్నా చివరికి అమృతంలా ఉండే సుఖమును సాత్విక సుఖమని అంటారు. అది ఆత్మ జ్ఞానము యందే స్థితమై ఉన్న నిర్మలమైన బుద్ధి వలన కలుగుతుంది.