శ్లోకం - 38

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే௨మృతోపమమ్ | పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రారంభంలో అమృతంలా ఉన్నా చివరికి విషములా ఉండే సుఖమును రాజస సుఖమని అంటారు. అది ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల కలయిక వలన కలుగుతుంది.