శ్లోకం - 39

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః | నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రారంభం నుండి చివరి వరకూ కూడా మోహం కలగజేసే సుఖమును తామస సుఖమని అంటారు. అది నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యము వలన కలుగుతుంది.