శ్లోకం - 42

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ | జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనోనిగ్రహము, ఇంద్రియముల నిగ్రహము, తపస్సు, శారీరక శుభ్రత, ఓర్పు, సత్ప్రవర్తన, వేద శాస్త్రముల జ్ఞానము, అనుభవ జ్ఞానము, దేవుడి మీద నమ్మకము అనునవి స్వభావ సిద్ధమైన బ్రాహ్మణ కర్మలు.