శ్లోకం - 43
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ | దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శౌర్యము, తేజస్సు, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధము నుండి వెనుతిరగకుండా దృఢ సంకల్పము కలిగిఉండుట, దాన గుణము మరియు నాయకత్వ సామర్ధ్యము అనునవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.