శ్లోకం - 44

కృషిగౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ | పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వ్యవసాయము, గోరక్షణము, వ్యాపారములు అనునవి స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. అలాగే అన్ని వర్ణముల వారికి సేవ చేయటమే స్వభావ సిద్ధమైన శూద్ర కర్మలు.