శ్లోకం - 45
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః | స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తమ కర్తవ్య కర్మల పట్ల శ్రద్ధ కలిగిన మానవులు సిద్ధిని పొందుచున్నారు. స్వభావసిద్ధమైన తన కర్మ మీద ఆసక్తి ఉన్నవాడు ఎలా సిద్ధి పొందుచున్నాడో చెబుతాను వినుము.