శ్లోకం - 46

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ | స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై సమస్త జగత్తు నందు వ్యాపించి ఉన్న పరమేశ్వరుడిని తన సహజ స్వభావ కర్తవ్యములను నిర్వర్తించడం ద్వారా ఆరాధించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు.