శ్లోకం - 48
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ | సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), దోషములు ఉన్నా కూడా సహజ సిద్ధమైన కర్మను విడిచిపెట్టరాదు. ఎందుకంటే, అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు కర్మలన్నీ కూడా ఏదోఒక దోషము కలిగి ఉంటాయి.