శ్లోకం - 49

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః | నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రాపంచిక విషయముల యందు ఆసక్తిని విడిచిపెట్టి, మనస్సుని జయించి, కోరికలు లేకుండా సన్యాసము చేత కర్మలు ఆచరించేవాడు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుచున్నాడు.