శ్లోకం - 50

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే | సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా పరమాత్మను ఎలా పొందుచున్నాడో నేను నీకు వివరిస్తాను వినుము.