శ్లోకం - 53

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ | విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహంకారమును, బలమును, గర్వమును, కోరికలను, కోపమును, స్వార్థమును విడిచి "ఇది నాది" అన్న భావన లేకుండా శాంత స్వభావము కలిగినవాడు బ్రహ్మస్వరూపము పొందడానికి అర్హుడు.