శ్లోకం - 54

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి | సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మ స్వరూపమును పొందిన వాడు ప్రశాంతమైన మనస్సు కలిగి దేనికీ దుఃఖించడు మరియు ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువును ఆశించడు. సర్వ ప్రాణుల పట్ల సమభావము గల అట్టి వాడు నా పరాభక్తిని పొందుచున్నాడు.