శ్లోకం - 55
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః | తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా పట్ల పరాభక్తి కలిగిన వాడు నేను ఎవరిని మరియు ఎంతటివాడిని అని యదార్ధముగా తెలుసుకొనుచున్నాడు. నా గురించి తెలుసుకున్న తరువాత పరమ భక్తితో నన్ను పరిపూర్ణముగా పొందుచున్నాడు.