శ్లోకం - 56
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః | మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎల్లప్పుడూ సర్వ కర్మలు నిష్కామ భావముతో చేస్తూ, కర్మల యొక్క ఫలములను నాకే అర్పిస్తూ చేయువాడు నా అనుగ్రహము వలన శాశ్వతమైన నాశనము లేని మోక్షమును పొందుచున్నాడు.