శ్లోకం - 57
చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః | బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త కర్మలను మనసా, వాచా, కర్మణా నాకే అర్పించి, నన్ను మాత్రమే పరమ లక్ష్యంగా భావించి, బుద్ధి యోగమును ఆశ్రయించి నిరంతరం నా యందే మనస్సును నిలుపుము.