శ్లోకం - 59
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే | మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నువ్వు అహంకారంతో ఈ యుద్ధం చేయను అని అనుకుంటే, నీ ఆ నిర్ణయం వ్యర్థము. ఎందుకంటే నీ స్వభావమే(క్షత్రియ ధర్మము) నిన్ను యుద్ధము చేయడానికి ప్రేరేపిస్తుంది.