శ్లోకం - 60
స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా | కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో௨పి తత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), నీ స్వభావం నుండి పుట్టిన నీ కర్మలచే బంధింపబడి ఉన్నావు. మోహము(అజ్ఞానము) వలన నీవు చేయకుండా ఉండాలని అనుకున్నా, స్వభావసిద్ధమైన కర్మను బలవంతంగా చేయవలసి వస్తుంది.