శ్లోకం - 61

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి | భ్రామయన్‌సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పరమేశ్వరుడు అన్ని జీవుల హృదయాలలో నివసిస్తూ ఉంటాడు. అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు తన మాయచేత జీవుల గతిని వారి కర్మల అనుగుణముగా, నిర్దేశిస్తూ ఉంటాడు.